Bhumika Chawla: గులాబీ రంగు చీరలో..వన్నె తగ్గని అందాలతో అలరిస్తున్న భూమిక

-

టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ భూమిక గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమె తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. టాలీవుడ్ స్టార్ హీరోలు అందరి సరసన దాదాపుగా యాక్ట్ చేసింది. ఈమె నటించిన సినిమాలన్నీ దాదాపుగా సక్సెస్ అయ్యాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేశ్ బాబు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్..ఇలా అందరితోనూ సినిమాలు చేసింది.

ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో భూమిక..తెలుగు సినిమాల్లో కీలక మైన పాత్రలను పోషిస్తోంది. 43 ఇయర్స్ భూమిక ప్రజెంట్ తన ఏజ్ కు తగ్గట్లు హుందాగా ఉండే రోల్స్ పిక్చర్స్ లో ప్లే చేసి ప్రేక్షకులను అలరిస్తున్నది. తెలుగు ప్రేక్షకులకు చివరగా ఈమె గోపీచంద్ ‘సీటీమార్’ సినిమాలో కనిపించింది. ఇందులో మ్యాచో మ్యాన్ గోపీచంద్ సిస్టర్ రోల్ ప్లే చేసింది.

ప్రస్తుతం ఈమె తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ పలు చిత్రాలు చేస్తోంది. మాలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ ‘ఇష్క్ నాట్ ఏ లవ్ స్టోరి’ని ‘ఆపరేషన్ రోమియో’ గా హిందీలో రీమేక్ చేస్తున్నారు. అందులో భూమిక కీ రోల్ ప్లే చేస్తోంది.

ఈ క్రమంలోనే ఇన్ స్టా గ్రామ్ వేదికగా గులాబీ రంగు చీరలో దిగిన ఫొటోలు షేర్ చేసింది. అలా బీచ్ లో దిగిన ఫొటోలను షేర్ చేయగా, అవి చూసి నెటిజన్లు ‘బ్యూటిఫుల్, లవ్ యూ మేడమ్, వెరీ నైస్, సో బ్యూటిఫుల్, క్వీన్, ఎక్సలెంట్’ అని కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version