జానీ మాస్టర్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. జానీ మాస్టర్ తల్లికి గుండెపోటు వచ్చింది. జానీ మాస్టర్ జైలుకు వెళ్లడంతో బెంగతో ఉన్న తల్లి బీబీ ఖాన్ గుండెపోటుకు గురైంది. ఆమెను నెల్లూరులోని బొల్లినేని ఆస్పత్రికి తరలించగా ఐసీయూలో చికిత్స పొందుతుంది.

కాగా, అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన కొరియోగ్రాఫర్ షేక్ జానీ భాష అలియాస్ జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ పై రంగారెడ్డి కోర్టులో వాదనలు పూర్తి అయ్యాయి. బెయిల్ పిటిషన్ పై ఈనెల 14 కు వాయిదా వేస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా ప్రత్యేక హోదా కోర్టు తీర్పును వెలువరించింది.