Bichagadu 2 : OTTలోకి వచ్చేసిన బిచ్చగాడు-2..ఎందులో స్ట్రీమింగ్ అంటే ?

-

బిచ్చగాడు సినిమా సంచలనం సృష్టించారు విజయ్‌ అంటోని. అయితే.. విజయ్ ఆంటోని హీరోగా .. ఆయన దర్శక నిర్మాణంలో ‘బిచ్చగాడు 2’ సినిమా రూపొందింది. మే 19వ తేదీన ఈ సినిమా తమిళంతో పాటు ఇతర భాషల్లోను విడుదల చేశారు. విడుదల చేసిన అన్ని ప్రాంతాల నుంచి ఈ సినిమా మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది. భారీ వసూళ్లను రాబట్టుకుంది.

అయితే, విజయ్ ఆంథోనీ హీరోగా నటించిన బిచ్చగాడు-2 సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. డిస్నీ+హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. బిచ్చగాడు సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఆ సినిమాకు సీక్వెల్ గా బిచ్చగాడు-2 మే 19న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు తెలుగుతో పాటు మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలో హిందీలోనూ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news