Fathers Day : నాన్నే కూతురికి మొదటి బాయ్ ఫ్రెండ్..!

-

అమ్మాయిల విషయానికి వస్తే.. చిన్నప్పటి నుంచి వాళ్లు చూసేది తన తండ్రినే. అందుకే.. అమ్మాయిలకు తన తండ్రే మొదటి బాయ్ ఫ్రెండ్. తన తండ్రితో ప్రేమగా, స్నేహంగా ఉంటారు అమ్మాయిలు.
తండ్రికి కూతురు… తల్లికి కొడుకంటే ఇష్టమని చాలామంది అంటుంటారు. అనడం కాదు అది నిజం. తండ్రికి కూతురంటేనే ఇష్టం.. కూతురుకు కూడా తండ్రి అంటేనే ఇష్టం. అలాగే తల్లికి కొడుకంటే ఇష్టం.. కొడుకుకు తన తల్లి అంటే ఇష్టం.

అమ్మాయిల విషయానికి వస్తే.. చిన్నప్పటి నుంచి వాళ్లు చూసేది తన తండ్రినే. అందుకే.. అమ్మాయిలకు తన తండ్రే మొదటి బాయ్ ఫ్రెండ్. తన తండ్రితో ప్రేమగా, స్నేహంగా ఉంటారు అమ్మాయిలు. తన తండ్రికి చిన్న చిన్న పనులు చేసిపెడతారు. తండ్రి కూడా తన కూతురు కోసం కొండ మీది కోతినైనా తెచ్చిస్తాడు. అలా వాళ్లిద్దరి మధ్య ఓ అనుబంధం ఏర్పడుతుంది. ఆ అనుబంధం జీవితాంతం వాళ్లిద్దరి మధ్య ఉంటుంది.

తల్లితో కూడా కూతురు అంత చనువుగా ఉండదు.. కానీ తండ్రితో ఉంటుంది. తండ్రితో అన్నీ పంచుకుంటుంది. ఆయన ఒక తండ్రే కాదు.. స్నేహితుడు కూడా. అందుకే అమ్మాయిలు తమకు పెళ్లయ్యేదాక తమకు స్నేహితుడిగా తన తండ్రినే భావిస్తారు. తండ్రిని కళ్లలో పెట్టుకొని చూసుకుంటారు.

చిన్నప్పుడు తండ్రి తన కూతురును ఎంతలా కాపాడుకుంటాడో… కూతురు పెరిగి పెద్దయ్యాక.. తన తండ్రిని అలాగే కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. తన పెళ్లయి భర్త తన జీవితంలోకి వచ్చినా సరే.. తండ్రి మీదున్న ప్రేమ మాత్రం కొంచెం కూడా తగ్గదు. అదే తండ్రీకూతురు మధ్య ఉండే బంధం. అది ఎన్నటికీ చెరగదు.

Read more RELATED
Recommended to you

Latest news