బిగ్ బాస్4 కొత్త ప్రోమో : నాగ్‌ వ‌చ్చేశాడు షాకింగ్ లుక్‌ లో

-

టెలివిజన్ లో టాప్ రియాలిటీ షోగా పేరు తెచ్చుకున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 కి సర్వం సిద్దం అయింది. ఇప్పటికే మూడు సీజన్స్ ని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ఇప్పుడు నాలుగో సీజన్ లోకి ప్రవేశించింది. ఓవైపు కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న తరుణంలో బిగ్ బాస్-4 ఉంటుందా లేదా అన్న సందేహాలకు నాగార్జున ముందు కొంత క్లారిటీ ఇచ్చారు.

ఆ తరువాత స్టార్ మా ఛానల్ ఇటీవలే టీజర్ తో తెరదించింది. తాజాగా ఇప్పుడు స్టార్ మా ఛానల్ మరో ప్రోమో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో హోస్ట్ నాగార్జున ఓ వృద్ధుడి వేషంలో టెలీ స్కోప్ లో చూస్తూ కనిపిస్తాడు. ఈ వీడియోను కొద్ది సేపటి క్రితం స్టార్ మా సోషల్ మీడియాలో పోస్టు చేసింది. నెక్ట్స్ ఏం జరుగుతుందో చూడ్డానికి స్టే ట్యూన్డ్ అంటూ టింగ్లీష్ లో ట్వీట్ కూడా చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news