గురుకుల ప్రవేశ పరీక్షలో గందరగోళం.. ఒకే హాల్ టికెట్ ఇద్దరికీ కేటాయింపు

-

తెలంగాణ ప్రభుత్వం ఆదివారం గురుకుల పాఠశాల్లో ప్రవేశపరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. రూరల్ మండలంలోని స్వర్ణభారతి కళాశాలలో నిర్వహించిన గురుకుల ప్రవేశ పరీక్ష గందరగోళం నడుమ నడిచాయి. ఒకే హాల్ టికెట్ ని ఇద్దరికి ఇవ్వడంతో ముందుగా వచ్చిన విద్యార్థి పరీక్ష రాసి వెనుక వచ్చిన ములకపాటి ధీరజ్ అనే విద్యార్థి పరీక్ష రాయలేకపోయాడు. పరీక్ష నిర్వాహకులు హల్ లోకి అనుమతించకపోవడంతో నిరాశతో ధీరజ్ ఇంటికి వెళ్లాడు. అధికారుల తప్పిదం వల్లే మా బాబు పరీక్ష రాయలేకపోయాడని వెంటనే న్యాయం చేయాలని విద్యార్ధి తల్లి దండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

అదే విధంగా కూసుమంచి కి చెందిన మరో విద్యార్థిని పరీక్షకు అనుమతించలేదు. నేల కొండపల్లి మండలానికి చెందిన ఎస్సీ కులానికి చెందిన మరో విద్యార్థి ఆదాయ ధ్రువీకరణ పత్రం రూ. 1.30వేలకు బదులు 13 లక్షలు పడటంతో పరీక్ష రాయకుండా వెనుదిరిగారు. ఇది కూడా అధికారుల తప్పిదం వల్లే విద్యార్ధి పరీక్ష రాయలేకపోయాడు. జిల్లా కలెక్టర్ స్పందించి మళ్లీ పరీక్ష రాయించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news