బిగ్ బాస్ కు బిగ్ బాస్.. కష్టమే..!

-

టైటిల్ కాస్త కన్ఫ్యూజ్ చేసేలా ఉన్న బిగ్ బాస్ అనగానే రియాలిటీ షోలలో రారాజుగా విరాజిల్లుతున్న బిగ్ బాస్ అని అందరికి గుర్తుకొస్తుంది. కాని ఈ బిగ్ బాస్ రాకముందే బిగ్ బాస్ అనే సినిమా తీసిన మన మెగాస్టార్ చిరంజీవి సినిమా ఎంతమందికి గుర్తుందో. ఆ బిగ్ బాస్ కు ఈ బిగ్ బాస్ కు సంబంధం ఏంటి అంటే బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 హోస్ట్ గా రీల్ బిగ్ బాస్ వస్తాడని ఓ రూమర్.

వార్తగా వస్తున్నా అసలు దీనికి ఏమాత్రం బిగ్ బాస్ లేదని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 1 యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేశాడు. అది సూపర్ హిట్ అనిపించుకోగా ఆ తర్వాత్ నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా వచ్చిన సీజన్ 2 కూడా హిట్ కొట్టింది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 3కి టైం వచ్చింది. ఈసారి హోస్టు రేసులో వెంకటేష్, నాగార్జున, చిరంజీవి ఉన్నారు. అదేంటి ఎన్.టి.ఆర్ సీజన్ 3కి వస్తాడని వార్తలొచ్చాయి కదా అంటే ఎన్.టి.ఆర్ ముందు చేయాలని అనుకున్నా ఆర్.ఆర్.ఆర్ సినిమా షూటింగ్ వల్ల రాజమౌళి అందుకు వద్దన్నాడట.

ఇక కొంతమంది చిరంజీవి బిగ్ బాస్ 3వ సీజన్ హోస్ట్ గా చేస్తారని అంటున్నారు. దానికి ఏమాత్రం అవకాశం లేదు. ప్రస్తుతం చిరు సైరా సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా తర్వాత కొరటాల సినిమా కూడా లైన్ లో ఉంది. అందుకే బిగ్ బాస్ కోసం బిగ్ బాస్ అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని చెప్పొచ్చు. తెలుస్తున్న సమాచారం వరకు విక్టరీ వెంకటేష్ ఈ సీజన్ హోస్ట్ గా చేస్తాడని అంటున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవం అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news