Big Boss Non Stop: ‘అరెయ్ అఖిల్..ఒసెయ్ బిందు’..‘బిగ్ బాస్’ కంటెస్టెంట్స్ మధ్య మాటల యుద్ధం..చివరకు

-

‘బిగ్ బాస్’ నాన్ స్టాప్ 24 బై 7 ఓటీటీ షోలో కంటెస్టెంట్స్ మాటలు శ్రుతి మించుతున్నాయి. బూతులు మాట్లాడుకోవడంతో పాటు డబుల్ మీనింగ్ మాటలు ఎక్కువవుతున్నాయి. తాజాగా బిగ్ బాస్ నిర్వాహకులు రిలీజ్ చేసిన ప్రోమోలో కంటెస్టెంట్స్ మధ్య మాటల యుద్ధం స్పష్టంగా కనబడుతోంది. ఇప్పటి వరకు కొంత డిప్లొమాటిక్ గా ఉన్న బిందు మాధవి సైతం తన వాయిస్ పెంచేసింది.

ఈ వారం జంట నామినేషన్స్ ఉండబోతున్నట్లు ‘బిగ్ బాస్’ తెలిపారు. ఈ క్రమంలోనే కంటెస్టెంట్స్ రీజన్ చెప్పి నామినేషన్స్ స్టార్ట్ చేశారు. దాంతో గేమ్ ఇంకా రసవత్తరంగా మారింది. కంటెస్టెంట్స్ ఒక్కొక్కరుగా వచ్చి తమ వాయిస్ వినిపిస్తున్నారు. గతంలో ఆడిన టాస్కుల గురించి డిస్కషన్ షురూ చేశారు. నటరాజ్ మాస్టర్, యాంకర్ శివల మధ్య మళ్లీ ఫైటింగ్ షురూ అయింది.

మంచిగా మాట్లాడండి మీరు.. అని శివ అనగా, నిన్ను వదలను అని నటరాజ్ మాస్టర్ అనేశారు. ఇక ఆ తర్వాత బిందు మాధవి, అఖిల్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. అలా ఏడో వారం గేమ్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నదని ప్రూవ్ అవుతోంది. 43వ డే ప్రోమో వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

శ్రవంతి ప్రస్తావన తెచ్చి అఖిల్ ను బిందు మాధవి టార్గెట్ చేసింది. అంతటితో ఆగకుండా ‘అరెయ్ అఖిల్ గా చెప్పురా’ అనేసింది. దాంతో అఖిల్ సైతం బిందు మాధవిని ఉద్దేశించి ‘ఒసెయ్ బిందు ఏం చెప్పాలె నీకు’ అని అన్నాడు. దాంతో కంటెస్టెంట్స్ షాక్ అయ్యారు. తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే సోమవారం రాత్రి 9 గంటలకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ చూడాల్సిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version