Big shock for Manchu Mohanbabu: టాలీవుడ్ విలక్షణ నటుడు మోహన్ బాబుకు మరో ఎదురు దెబ్బ తగిలింది. టాలీవుడ్ నటుడు మోహన్ బాబు పై తాజాగా హత్యాయత్నం కేసు నమోదు కావడం జరిగింది. టీవీ9 ఛానల్ రిపోర్టర్ పై దాడి చేసినందుకు నిన్న మంచు మోహన్ బాబు పైన బి.ఎన్.ఎస్ 118 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు… ట్విస్ట్ ఇవ్వడం జరిగింది.
ఆ సెక్షన్ 118 కేసును హత్యాయత్నం గా మార్చారు పోలీసులు. లీగల్ ఒపీనియన్ తీసుకున్న పోలీసులు బి.ఎన్.ఎస్… 109 సెక్షన్ కింద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడం జరిగింది. మన వైపు ఈ ఘర్షణలు గాయపడ్డ మోహన్ బాబు ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక అటు నిన్న మంచు మనోజ్, విష్ణు.. ఇద్దరూ పోలీసుల విచారణను ఎదుర్కొన్నారు.