మేడ్చల్ లో విషాదం చోటు చేసుకుంది. ఫుట్ పాత్ పై మహిళా మృతదేహం కలకలం రేపుతోంది. ఈ సంఘటన ఇవాళ ఉదయం తెరపైకి వచ్చింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మేడ్చల్ జిల్లా చింతల్ లో దారుణం చోటు చేసుకుంది. తీవ్ర గాయాలతో ఫుట్ పాత్ పై మహిళా మృతదేహం కనిపించింది.
హత్యా చారం అనంతరం దుండగులు ఫుట్ పాత్ పై వది లేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే… తీవ్ర గాయాలతో ఫుట్ పాత్ పై మహిళా మృత దేహం గురించి స్థానిక పోలీసులకు జనాలు సమాచారం ఇచ్చారు. దీం తో రంగంలోకి దిగిన పోలీసులు.. ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసును విచారిస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.