ఎన్టీఆర్ కు బిగ్ షాక్… దేవరకు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నిరసన సెగ ?

-

టాలీవుడ్‌ స్టార్‌, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన తాజా చిత్రం దేవర ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలోనే… ఎన్టీఆర్ కు బిగ్ షాక్ తగిలింది… దేవరకు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నిరసన సెగ తగిలింది. దేవర సినిమా పోస్టర్లపై సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నినాదాలతో ఉన్న పోస్టర్‌ అతికించారు కార్మికులు.

Big shock for NTR How long will Visakha steel plant protest

విశాఖ ఉక్కు ఉద్యమానికి జూనియర్ ఎన్టీఆర్ మద్దతు కోరుతూ జన జాగరణ సమితి విజ్ఞప్తి చేస్తోంది. ఇందులో భాగంగానే… దేవర సినిమా పోస్టర్లపై సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నినాదాలతో ఉన్న పోస్టర్‌ అతికించారు కార్మికులు. విశాఖపట్నం రామా టాకీస్ థియేటర్ వద్ద సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్.. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అనే నినాదాల పోస్టర్లను అంటించారు. కాగా ప్రపంచవ్యాప్తంగా దేవర సినిమా రేపు రిలీజ్‌ కానున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version