అనిల్ రావిపూడి అలాగే మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో సినిమా వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోగా మెగాస్టార్ చిరంజీవికి ఉండగా… నయనతార హీరోయిన్గా నటిస్తున్నారు. షైన్ స్క్రీన్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటివరకు పెద్ద అప్డేట్ రాలేదు.

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఈనెల 22వ తేదీ అన్న సంగతి తెలిసిందే. అయితే ఆ రోజున ఖచ్చితంగా అప్డేట్ వస్తుందని అంచనా వేస్తున్నారు అభిమానులు. ఈనెల 22వ తేదీన చిరంజీవి అలాగే అనిల్ మూవీ కి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ వస్తాయని సోషల్ మీడియాలో ప్రచారం జోరు అందుకుంది. మరి ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. అధికారిక ప్రకటన వస్తేనే… నమ్మాలని అభిమానులు అంటున్నారు.