బీఆర్‌ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. నేడు మెదక్ లో బీఆర్‌ఎస్ రైతు మహాధర్నా జరుగనుంది. అసంపూర్తి రుణమాఫీ, కోతల రైతు భరోసాలతోపాటు బోనస్ ఎగవేత తదితర అంశాలపై రైతుల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీసేందుకు మెదక్ కలెక్టరేట్ ధర్నా చౌక్ వేదికగా మహాధర్నా జరిగింది.

నేడు మెదక్ లో జరుగనున్న బీఆర్‌ఎస్ రైతు మహాధర్నాలో మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు గారు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరుకానున్నారు. కాగా కాంగ్రెస్ ఢిల్లీ ధర్నాపై హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. బీసీలకు 42శాతం కోటా పేరిట రేవంత్ అండ్ బ్యాచ్ ఢిల్లీ వెళ్లిన చేసిన డ్రామా అట్టర్ ఫ్లాప్ అయ్యిందన్నారు. ఢిల్లీ వేదికగా నిర్వహించిన దొంగ దీక్షకు.. కూతవేటు దూరంలో ఉండి రాహుల్ రాలేదని చురకలు అంటించారు.
మాకు బీసీ కన్న బిహారే ముఖ్యమని ఖర్గే రాలేదని వెల్లడించారు. మీ ధర్నాలో నిజాయితీ లేదని, బీసీలకు 42శాతం కోటా అమలు చేస్తారనే మాటలపై నమ్మకం రాహుల్ గాంధీ, ఖర్గే లతో పాటు, తెలంగాణ ప్రజలకు కూడా లేదని సుస్పష్టం అయ్యిందని పేర్కొన్నారు.