తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అలర్ట్. మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉండనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి మూడు రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఈరోజు యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో, శుక్రవారం జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. అదే సమయంలో హైదరాబాదులో కూడా ఇవాళ భారీ వర్షం పడే ఛాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు. ఇక ఏపీలో కూడా మూడు రోజులపాటు వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు అమరావతి వాతావరణ శాఖ స్పష్టం చేసింది. కాబట్టి చేపల వేటకు వెళ్లే వారు చాలా జాగ్రత్తగా ఉండాలని వెల్లడించారు అధికారులు. ఏపీలోని కోస్తాంధ్ర ప్రాంతంలో మాత్రమే వర్షాలు విపరీతంగా కొడతాయని కూడా వెల్లడించింది అమరావతి వాతావరణ శాఖ.