AKHIL : “ఏజెంట్‌” నుంచి అదిరిపోయే పోస్టర్‌..సిక్స్‌ ఫ్యాక్‌ తో కుమ్మేసిన అఖిల్‌

-

టాలీవుడ్ మన్మథుడుగా పేరు తెచ్చుకున్న అక్కినేని నటవారసుడు నాగార్జున తనయుడు అఖిల్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఇప్పటి వరకు లవర్ బాయ్ ఇమేజ్ కోసం పరితపించి భంగపడ్డ ఈ హీరో ప్రస్తుతం విలక్షణ దర్శకుడు సురేందర్ రెడ్డితో కలిసి “ఏజెంట్” అనే మూవీ చేస్తున్నాడు.ఈ మూవీలో అఖిల్ క్యారెక్టరైజేషన్ భిన్నంగా ఉండనుందని సమాచారం.

సురేందర్ రెడ్డి సినిమాలంటేనే హీరోల గెటప్ పూర్తిగా మార్చేస్తాడని టాక్ ఉంది. గతంలో ఆయనతో సినిమాలు చేసిన మహేశ్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ల గెటప్ లను గుర్తు పట్టలేకుండా మార్చేసి కొత్తగా ప్రజెంట్ చేశాడు. ఇప్పుడు యంగ్ హీరో అఖిల్ ను కూడా అలాగే మార్చేసేందుకు కంకణం కట్టుకున్నాడు.

ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్లు సినిమాపై అంచనాలను పెంచగా.. తాజాగా మరో పోస్టర్‌ ను రిలీజ్‌ చేశారు. నేడు అఖిల్‌ పుట్టిన రోజు ఉన్న నేపథ్యంలో.. ఓ బ్లాస్టింగ్‌ పోస్టర్‌ ను రివీల్‌ చేసింది చిత్ర బృందం. ఈ పోస్టర్‌ లో సిగరేట్‌ తాగుతూ… దర్శనమించాడు అఖిల్. కాగా.. ఈ మూవీ ఆగస్టు 12 న విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news