Varun Tej Ghani : గ‌ని ట్విట్ట‌ర్ రివ్వూ.. బాక్సాఫీస్ పై పంచ్ ప‌డ‌లేదా..?

-

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరో గా తెర‌కెక్కిన తాజా సినిమా గ‌ని. కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న మొదటి చిత్రం ఇది. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ఫ‌ణ‌లో అల్లు బాబీ, సిద్దు ముద్ద ప్రొడ్సూస్ చేసిన ఈ సినిమా ఈ రోజు విడుద‌ల అయింది. అల్లు బాబి కూడా ఈ సినిమాతోనే నిర్మాత గా ప‌రిచయం అవుతున్నాడు. ఈ సినిమా చిత్రిక‌ర‌ణ గ‌తంలో పూర్తి అయినా.. కరోనా వైర‌స్ వ్యాప్తి కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌స్తుంది.

అన్ని అడ్డంకుల‌ను తొల‌గించుకుని ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా థీయేట‌ర్ ల‌లో విడుద‌ల అయింది. బెనిఫిట్ షో ల ద్వారా ముంచే చూసిన అభిమానులు ట్విట్ట‌ర్ లో త‌మ అభిప్రాయాల‌ను చెబుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పాటలు, టీజ‌ర్ ట్రైల‌ర్ తో విడుద‌ల కు ముందే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. భారీ అంచ‌నాల‌తో విడుద‌ల అయిన ఈ సినిమా ప్రేక్షకుల‌ను ఆక‌ట్టుకుందో లేదో చూద్దం.

బేనిఫిట్ షో ద్వారా ముందే చేసిన సినీ అభిమానులు.. ట్విట్ట‌ర్ వేదికగా రివ్వూలు ఇస్తున్నారు. ఈ సినిమా ప్ర‌స్తుత టాక్ ప్ర‌కారం… మిశ్ర‌మ స్పంద‌న వ‌స్తుంది. రోటీన్ స్పోర్ట్స్ డ్రామ అంటూ కొంత మంది ట్వీట్ చేస్తున్నారు. అలాగే ఫ‌స్ట్ ఆఫ్ బోరింగ్ గా ఉంద‌ని సెకండ్ ఆఫ్.. ఆస‌క్తిగా ఉంద‌ని ట్వీట్ చేస్తున్నారు. మ‌రి కొంద‌రు వ‌రుణ్ తేజ్ హిట్ కొట్టాడ‌ని చెబుతున్నారు. అలాగే మ‌రి కొంద‌రు జీరో ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ సినిమా కు ట్విట్ట‌ర్ లో సినీ అభిమానులు.. 2.5 నుంచి 3 వ‌ర‌కు రేటింగ్ ఇస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news