సీజన్ మొదటి నుండి సింపతీ మీద గేమ్ ఆడుతున్నవారిలో అమ్మ రాజశేఖర్ ఒకరు. మొదట్లో నోయల్ కొద్దిగా సింపతీ వైపు వెళ్ళాలని ప్రయత్నించినప్పటికీ నాగార్జున గారు గట్టిగా క్లాస్ పీకడంతో మళ్ళీ అటు వైపు వెళ్ళలేదు. ఐతే గత కొన్ని రోజులుగా చూస్తుంటే అమ్మ రాజశేఖర్ ని కాపాడుతుంది సింపతీయే అని తెలుస్తుంది. హౌస్ లో ఏదైనా వాదన జరిగినపుడు ఇష్టం వచ్చినట్టు అరుస్తూ ఉంటాడు తప్ప ఎదుటివారు చెప్పేది పట్టించుకోడనే పేరు ఉంది. ఈ మేరకు చాలా సార్లు ప్రూవ్ అయ్యింది కూడా. తనకి తోచింది మాట్లాడేసి, మిగతా వారిని మాత్రం ఏమీ మాట్లాడకూడదని అంటుంటాడు.
ఈ రోజు ఎపిసోడ్ లో హారికతో జరిగిన గొడవలో కూడా అలానే చేసాడు. అదీగాక ప్రతీసారి క్యారెక్టర్ ని బ్యాడ్ చేసే విధంగా మాట్లాడుతున్నాడంటూ నోయల్ కూడా మాట్లాడాడు. దానికి లాస్య కూడా సపోర్ట్ చేసింది. ఈ లెక్కన హౌస్ లో చాలా మందికి అమ్మ రాజశేఖర్ పై వ్యతిరేకత ఉంది. అదంతా చూస్తుంటే ఈ సారి ఎలిమినేషన్స్ లో అమ్మ రాజశేఖర్ ఇంటి నుండి వెళ్ళిపోతాడేమో అని అనుకుంటున్నారు. మరి అందరితో ఏర్పడిన వ్యతిరేకత వల్ల సింపతీ వచ్చి ఇంట్లో ఉంటాడా లేదా ఆ వ్యతిరేకతే మైనస్ గా మారి ఇంట్లో నుండి వెళ్ళిపోతాడా అనేది చూడాలి.