బిగ్‌బాస్ 4: అలీరెజాలా మ‌ళ్లీ వ‌చ్చేస్తున్నాడా?

ఈ ఆదివారం మోహ‌బూబ్ ఇంటి నుంచి బ‌య‌టికి వెళ్లిపోతున్నాడు. ఇదిలా వుంటే గ‌త సీజ‌న్‌లో అలీరెజా మ‌ధ్య‌లోనే హౌస్ నుండి ఎలిమ‌నేట్ అయి బ‌య‌టికి వెళ్లిపోయాడు. రెండు వారాల త‌రువాత‌ మ‌ళ్లీ హౌస్‌లోకి ప‌బ్లిక్ డిమాండ్ మేర‌కు ఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. అలా వ‌చ్చిన అలీరెజా టాప్ 5లోకి వెళ్లిపోయాడు. ఇదే త‌ర‌హాలో కుమార్ సాయి కూడా మ‌ళ్లీ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడా అంటే అవున‌నే వార్త‌లు ఆదివారం మొద‌ల‌య్యాయి.

ఏడ‌వ వారం ఈ సీజ‌న్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు సుకుమార్ సాయి. అయితే అతను మ‌ళ్లీ అలీరెజా త‌ర‌హాలో రీఎంట్రీ ఇస్తాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మ‌న్న‌ది తెలియాలంటే వ‌చ్చే వారం వ‌ర‌కు వేచి చూడాల్సిందే అయితే కుమార్ సాయి హౌస్ నుండి వెళ్లిపోయి దాదాపు 4 వారాలు అవుతున్న నేప‌థ్యంలో అత‌ని రీఎంట్రీ ఓ రూమ‌రే అని కొంత మంది కొట్టి పారేస్తున్నారు. కొంత మంది మాత్రం ఏదీ చెప్ప‌లేమ‌ని చెబుతున్నారు.