బిగ్ బాస్: భర్త గురించి షాకింగ్ విషయం బయటపెట్టిన లాస్య..

-

బిగ్ బాస్ లో ఈ రోజు ఎపిసోడ్ అంతా రహస్యాలని పంచుకోవడంతోనే సరిపోయింది. తమ జీవితంలో ఇప్పటి వరకూ ఎవ్వరికీ తెలియని రహస్యాన్ని పంచుకుంటే తమ ఆత్మీయుల నుండి లేఖని అందుకోవచ్చని చెప్పడంతో ప్రతీ ఒక్కరూ రహస్యాలని బిగ్ బాస్ సాక్షిగా ప్రేక్షకులతో పంచుకున్నారు. ఐతే అందరిలోకీ ఎక్కువగా ఆకర్షించింది మాత్రం హారిక, లాస్య.

లాస్య, ఇదివరకే తనకి 2010లోనే పెళ్ళయ్యిందనీ, కానీ ఎవ్వరికీ తెలియనివ్వకుండా మళ్ళీ పెద్దల సమక్షంలో 2017లో పెళ్ళి చేసుకున్నామని బయటపెట్టింది. తాజాగా ఈ రోజు తన భర్త గురించి సీక్రెట్ విషయాన్ని చెప్పింది. లాస్య భర్త మంజు మారాఠీ అబ్బాయి అనీ, తన కంటే వయసులో ఒక సంవత్సరం చిన్నవాడనీ, ఈ విషయం అమ్మకి కూడా ఇప్పటి దాకా తెలియదని, బిగ్ బాస్ కి వచ్చి అమ్మకి షాక్ ల మీద షాకులు ఇస్తున్నానని చెప్పింది.

ఇంకా హారిక, తన రిలేషన్ షిప్ ని బయటపెట్టింది. నాలుగున్నర సంవత్సరాల పాటు ఒక అబ్బాయితో రిలేషన్ లో ఉన్నాననీ, కానీ ఇప్పుడు అలాంటివేమీ లేవనీ, రెండు సంవత్సరాల క్రితమే బ్రేకప్ జరిగిపోయిందనీ, ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నానని, టెన్షన్ పెట్టుకోవద్దని అమ్మకి చెప్తూ అందరితో పంచుకుంది.

తాగి బండి నడిపి పోలీసులకి దొరికిపోయి, పేరెంట్స్ ని తీసుకురమ్మని అడిగితే, జూనియర్ ఆర్టిస్టులని అరేంజ్ చేసి అక్కడి నుండి తప్పించుకున్నానని చెప్పిన సోహైల్, రాత్రిపూట తన ఫ్రెండ్ ని రైల్వేస్టేషన్ లో దిగబెట్టడానికి వెళ్ళి, పోలీసులకి చిక్కి రెండురోజుల పాటు స్టేషన్లో ఉండాల్సి వచ్చిందని తెలియజేసిన మెహబూబ్.. అవకాశం ఇస్తానంటే ఎనభై వేలు నిర్మాత చేతిలో పెట్టి, మోసపోయానని అవినాష్, ఆక్సిడెంట్ లో తన ప్రాణాలు పోవాల్సిందని చెప్పిన ఆరియానా.. అందరూ తమ జీవితాల్లోని రహస్యాలని పంచుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version