బిగ్ బాస్ – 5 ప్రోమో రిలీజ్ …. అదరగొట్టిన నాగ్

తెలుగు టెలివిజన్లో అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షోగా బిగ్ బాస్ ని చెప్పుకోవచ్చు. బిగ్ బాస్ ప్రారంభం కాగానే.. అందరూ టీవి లకే అతుకు పోతారు. అయితే తాజాగా బిగ్ బాస్ 5 (Bigg Boss 5) తెలుగు ప్రోమో ను విడుదల చేసింది స్టార్ మా బృందం. ఇక ఈ బిగ్ బాస్ 5 అందరికీ ఆకట్టుకునే ఉంది.

ఈ ప్రోమో లో టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున.. తన డాన్స్ మరియు డైలాగులతో అందరినీ అలరించారు. ” బోర్ డం కు గుడ్ బై చెప్పండి. వచ్చేస్తుంది బిగ్ బాస్ 5 ” అంటూ ఓ గన్ పట్టుకొని నాగ్ డైలాగు విసిరారు. త్వరలోనే బిగ్ బాస్ 5 ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నాడు నాగ్. ఇక ఈ ప్రోమో చూశాక.. బిగ్ బాస్.. కొత్త ఆనందం నెలకొంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 5 లో కంటెస్టెంట్లుగా ఎవరెవరు రాబోతున్నారన్న విషయంలో అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. ఇప్పటికే యాంకర్ రవి లాంటి పలుగురి పేర్లు వినిపిస్తున్నాయి.