బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆర్.జే.శేఖర్ భాషా గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఆర్ జే శేఖర్ భాష ఈ బిగ్ బాస్ సీజన్ లో హౌస్ లోకి అడుగుపెట్టి అడుగు పెట్టిన కొద్ది రోజుల్లోనే బయటకు వచ్చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే.. తాజాగా ఇతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. హర్ష సాయి కేసులో ఆర్జే శేఖర్ భాషాని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
హర్ష సాయి బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా శేఖర్ భాషాని అదుపులోకి తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు ప్రస్తుతం ఆయనని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. దాదాపు మూడు గంటలుగా సైబర్ క్రైమ్ ఆఫీస్ లో ఆర్జె శేఖర్ భాషాను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. బాధితురాలికి సంబంధించిన నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నందుకు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో ఆమెపై అసత్య ప్రచారాలు చేసినందుకు శేఖర్ భాషా పై సైబర్ క్రైమ్ లో హర్ష సాయి బాధితురాలు కంప్లైంట్ చేసినట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి హర్ష సాయి మీద హర్ష సాయి హీరోగా నటించిన మెగా సినిమా నిర్మాత, బిగ్ బాస్ ఫేమ్ మిత్ర శర్మ ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇంకా హర్ష సాయి ఎక్కడున్నాడనే విషయాన్ని కనిపెట్టలేక పోతున్నారు. ప్రస్తుతానికి హర్ష సాయి పరారీలోనే ఉన్నాడు.