యాదాద్రి గోపురానికి బంగారు తాపడం.. మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు

-

ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు.  సచివాలయంలో దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష జరిపిన ఆమె పలు కీలక విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ.. యాదాద్రి ఆలయంలో భక్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని తమ దృష్టికి వచ్చిందని.. ఈ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరిస్తున్నామని తెలిపారు. గతంలో గుట్ట పై మంచి నీటి సౌకర్యం సరిగ్గా లేదని తెలిసి, 14 చోట్ల డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేశామని తెలిపారు.  అలాగే టాయిలెట్ల సమస్య కూడా ఉందని ఫిర్యాదులు రావడంతో  గుట్టపై 47 టాయిలెట్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు.

భక్తుల కోసం విష్ణు పుష్కరిణి, గిరి ప్రదక్షిణ చేసేందుకు 3 కిలోమీటర్ల మేర రోడ్డు మార్గం నిర్మించామని తెలిపారు. ప్రసాదాల కౌంటర్ల ను పెంచడమే గాక ఆన్లైన్ లో ప్రసాదాలు ఆర్డర్ చేసుకునే సౌకర్యం కూడా కల్పించామని చెప్పారు. అలాగే యాదాద్రి గోపురానికి బంగారు తాపడం చేయించాలని జీవో జారీ చేసినట్టు తెలిపారు. అయితే ఈ పనులు వచ్చే ఏడాది బ్రహ్మోత్సవాల లోపు పూర్తి కావాలని వారికి ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ఇందుకోసం  ఇప్పటికే 60 కిలోల బంగారం అందుబాటులో ఉంచామని.. భక్తుల ఎవరైనా విరాళాలు ఇవ్వాలని అనుకుంటే ఆన్లైన్ సదుపాయం ద్వారా ఇవ్వచ్చని సూచించారు మంత్రి కొండా సురేఖ.

Read more RELATED
Recommended to you

Exit mobile version