ప్యాంట్ వేసుకోవడం మరిచిపోయింది.. బిగ్‌బ్యాస్ బ్యూటీపై కామెంట్స్

-

బిగ్‌బాస్ రియాల్టీ షో ద్వారా ఎంతో మంది వెలుగులోకి వచ్చారు. తెరపై కనిపించే వారి నిజమైన స్వభావాన్ని, వ్యక్తిత్వాన్ని మన ముందు నిలిపేదే బిగ్‌బాస్. అప్పటి వరకు అభిమానించిన వారిని ద్వేషించవచ్చు లేదు.. అప్పటి వరకు నచ్చని వ్యక్తిపై ఇష్టం కూడా పెరగవచ్చు. అదే బిగ్‌బాస్ షో మహిమ. ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్లందరికీ మంచి పేరు వస్తుందా? అంటే చెప్పలేం.

ఇప్పటికే తెలుగు మూడు సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ షో.. ఎంతో మందిని లైమ్ లైట్‌లోకి తీసుకొచ్చింది. ఇంకెంతో మందిని చీకట్లోకి నెట్టేసింది. మొదటి సీజన్‌లోని పార్టిసిపేట్స్ అయితే అడ్రస్ లేకుండా పోయారు. విన్నర్‌గా నిలిచిన శివ బాలాజీ అప్పుడప్పుడు కనిపిస్తాడు కానీ షో ద్వారా ఒక్క అవకాశం కూడా రాలేదు. ఇక రెండో సీజన్‌లోని కంటెస్టెంట్లలో తేజస్వీపై నెగెటివిటీ పెరిగింది. విజేతగా నిలిచిన కౌశల్‌పైనా భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి.

ఇక మూడో సీజన్ అన్నింటి కంటే కాస్త బెటర్ అని చెప్పొచ్చు. నెగెటివిటీ శాతం కొంచెం తక్కువ. దాదాపు పార్టిసిపేట్ చేసిన సభ్యులందరికీ ఎంతో కొంత మంచి పేరే వచ్చింది. విజేతగా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్ పేరు మార్మోగిపోయింది. అంతేకాకుండా రోహణి, రవికృష్ణ, అలీ రెజా, పునర్నవి, వరుణ్ సందేశ్, వితికా షెరు, అషూ, హిమజ ఇలా ప్రతీ ఒక్కరూ వెలుగులోకి వచ్చారు.

ముఖ్యంగా అషూ రెడ్డికి మాత్రం అంత వరకున్న పాపులారిటీ రెట్టింపైంది. మధ్యలోనే ఎలిమినేట్ అయినా.. క్యూట్ క్యూట్ మాటలతో, డ్యాన్సులతో ఎంటర్టైన్ చేసి అభిమానులను సొంతం చేసుకుంది. ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగా పెరిగింది. బయటకు వచ్చిన అషూ హాట్ హాట్ ఫోటోలతో రచ్చ చేస్తూ ఉంటుంది.

తాజాగా షేర్ చేసిన ఓ ఫోటోకు వింత కామెంట్స్ వస్తున్నాయి. ప్యాంట్ వేసుకోలేదని కొంత మంది అంటుంటే.. ఆ పోజు చూసి బ్రష్ వేసుకుంటున్నావేమోనని అనుకున్నా అంటూ వింత వింత కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా అషూ షేర్ చేసే ఫోటోలను చూస్తే మాత్రం సినిమా అవకాశాల కోసం బాగానే ప్రయత్నిస్తున్నట్టు అర్థమవుతోంద.

 

Read more RELATED
Recommended to you

Latest news