పోసాని పై పెట్టిన సెక్షన్లు చంద్రబాబుకి కూడా వర్తిస్తాయి : సతీష్ కుమార్

-

2024 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ఉద్యోగులు ఓటు వేశారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది అంటే ఉద్యోగుల్లో ఎంత వ్యతిరేకత వుందో అర్థం అవుతుంది అని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి అన్నారు. గడిచిన తొమ్మిది నెల్లుగా ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారు. తొమ్మిది నెలలు అవుతున్నా ప్రభుత్వం పీఆర్సీ కమిషన్ కూడా వేయలేదు. పీఆర్సీ కమిషన్ చైర్మన్ నీ కూడా రాజీనామా చేయించారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితాలు కూటమి ప్రభుత్వానికి కను విప్పు కావాలి.

ఈ ప్రభుత్వం ఏ సమస్య గురించి అడిగినా గత ప్రభుత్వం పై సాకులు చెబుతున్నారు. ఉత్తరాంధ్ర టీచర్లు మీకు వాతలు పెట్టారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రాష్ట్ర ప్రజలు వాత పెట్టడానికి సిద్ధంగా వున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ వారికి పనులు చేస్తే పాముకు పాలు పోసినట్లు అని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14,16,21 లను చంద్రబాబు ఉల్లంఘించారు. పోసాని మురళీ కృష్ణ పై పెట్టిన సెక్షన్లు చంద్రబాబుకి కూడా వర్తిస్తాయి. చంద్రబాబు వ్యాఖ్యలను బేస్ చేసుకొని మిమ్మల్ని ఎందుకు డిస్ క్వాలిఫై చేయకూడదు. చంద్రబాబునీ సీఎంగా అనర్హుడిగా ప్రకటించాలని న్యాయ పోరాటం చేస్తాం. చంద్రబాబు సీఎంగా అనర్హుడిగా ప్రకటించాలని గవర్నర్ ని కలుస్తాం. గవర్నర్ స్పందించక పోతే న్యాయ పోరాటం చేస్తాం అని సతీష్ కుమార్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news