రెండు సీజన్లలో పెద్దగా వివాదాలేవీ లేనప్పటికీ.. మొదటి సీజన్ కు రెండో సీజన్ కు మధ్య కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా మొదటి షోను హోస్ట్ చేసింది ఎన్టీఆర్ అయితే.. రెండో షోను నాని హోస్ట్ చేశారు. మొదటి సీజన్ లో పెద్దగా వివాదాలు అయితే లేవు.
బిగ్ బాస్.. ఈ కాన్సెప్ట్ ఆధారంగా ముందుగా హిందీలో షో ప్రారంభం అయింది. తర్వాత మెల్లగా ఇతర భాషలకు కూడా వచ్చేసింది. తెలుగులోనూ ఇప్పటికే విజయవంతంగా రెండు సీజన్లను ఈ షో పూర్తి చేసుకుంది.
అయితే.. రెండు సీజన్లలో పెద్దగా వివాదాలేవీ లేనప్పటికీ.. మొదటి సీజన్ కు రెండో సీజన్ కు మధ్య కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా మొదటి షోను హోస్ట్ చేసింది ఎన్టీఆర్ అయితే.. రెండో షోను నాని హోస్ట్ చేశారు. మొదటి సీజన్ లో పెద్దగా వివాదాలు అయితే లేవు.
కానీ.. రెండో సీజన్ లో మాత్రం కంటెస్టెంట్ల ఆర్మీలు లైమ్ లైట్ లోకి వచ్చాయి. మొదటి సీజన్ లో ఈ ఆర్మీల గోలే లేదు. కానీ.. రెండో సీజన్ విజేత కౌషల్ తన ఆర్మీల ఓట్ల వల్లే గెలిచారంటూ వార్తలు కూడా వచ్చాయి.
ఆర్మీలంటే ఏం లేదు.. ఫాలోవర్స్ లేదా ఫ్యాన్స్.. అయితే బిగ్ బాస్ విషయంలో మాత్రం ఈ ఆర్మీలను కంటెస్టెంట్లే తయారు చేసుకుంటున్నారు. దాని కోసం డబ్బులు ఖర్చు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయా కంటెస్టెంట్లు, వాళ్ల అభిమానులు.. గ్రూపులు, పేజీలు క్రియేట్ చేసి.. యూజర్లను ఆకర్షించి.. అందులో ఆయా కంటెస్టెంటుకు సంబంధించిన కంటెంట్ పెట్టి.. హౌస్ లో ఓట్లు వేసే సమయంలో ఆ కంటెస్టెంట్ కే ఓటేయాలంటూ అభ్యర్థిస్తారు. ఆయా గ్రూపుల్లో ఎంత మంది ఉంటే అంతమంది ఆ గ్రూప్ అడ్మిన్ చెప్పినట్టు చేస్తారు. అలా.. కంటెస్టెంట్లకు ఓట్లు పడతాయి. ఇదంతా పెద్ద వ్యవహారమే. తన ఆర్మీల ద్వారానే కౌశల్ గెలిచాడని ఇప్పటికీ టాక్ ఉంది.
కట్ చేస్తే… త్వరలో మూడో సీజన్ కూడా స్టార్ట్ కాబోతోంది. త్వరలో ఏంటి రేపే అంటే జులై 21నే ఈ షో మొదటి ఎపిసోడ్ స్టార్ మాటీవీలో రాత్రి 9.30 కు ప్రసారం కానుంది. అయితే.. ఈ సారి కంటెస్టెంట్లలో కొందరి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.
తీన్ మార్ సావిత్రి, పటాస్ శ్రీముఖి మాత్రం ఈ షోలో కన్ఫమ్ అంటూ వార్తలు కూడా వచ్చాయి. ఇంకా మిగితా కంటెస్టెంట్లు వరుణ్ సందేశ్, కొందరు సింగర్లు, మరికొందరు నటులను తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
అయితే.. ఈసారి పక్కాగా… కంటెస్టెంట్లు అందరూ తమ ఆర్మీలతో ముందే సిద్ధమయ్యారట. ఎందుకంటే.. రెండో సీజన్ లో ఏం జరిగిందో వాళ్లకు తెలుసు కదా. అందుకే… తీన్ మార్ సావిత్రి కూడా తన ఆర్మీతో సిద్ధంగా ఉందట. పటాస్ శ్రీముఖి కూడా తన సైన్యంతో ఢీకొట్టడానికి సిద్ధమైపోయిందట. అలాగే మిగితా కంటెస్టెంట్లు కూడా పక్కాగా ప్లాన్ వేసుకొని తమ ఆర్మీలతో సిద్ధమైపోయారట.
కాకపోతే.. మిగితా సీజన్ల కంటే ఈ సీజన్ ను చాలా వివాదాలు చుట్టుముట్టాయి. చివరకు అవి హోస్ట్ నాగార్జున వరకూ వెళ్లాయి. నటి గాయత్రి, యాంకర్ శ్వేతారెడ్డి.. బిగ్ బాస్ పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మహిళలను కించపరిచేలా.. వాళ్లను హింసించేలా ఉన్న ఈ షోను వెంటనే రద్దు చేయాలంటూ ఆందోళనలు కూడా వచ్చాయి. ఈనేపథ్యంలో అసలు షో రేపు ప్రారంభం అవుతుందా? లేదా? వేచి చూడాలి.