Bigg Boos 5 : యాంక‌ర్ ర‌వి షాక్.. హౌస్ నుంచి అవుట్ ?

-

బిగ్ బాస్ సిజ‌న్ 5 యాంక‌ర్ ర‌వి షాక్. 12 వ వారం ఎలిమినేష‌న్స్ లో భాగంగా యాంక‌ర్ ర‌వి ఎలిమినేట్ అయిన‌ట్టు తెలుస్తుంది. అయితే ఈ వారం నామినేష‌న్స్ లో ర‌వి తో పాటు సిరి, య‌ణ్ముక్, స‌న్నీ, శ్రీ రామ్, కాజ‌ల్, ప్రియాంక ఉన్నారు. దీని లో అందిరి ని ఆశ్చ‌ర్య ప‌రుస్తు యాంక‌ర్ ర‌వి ఎలిమినేట్ అయ్యాడ‌ని స‌మాచారం. కాగ ఇప్ప‌టి వర‌కు ర‌వి స్ట్రాంగ్ కంటెస్టంట్ గా ఉన్నాడు. టాప్ తో ఉండే అవ‌కాశ‌లు ఎక్కువ ర‌వి కి ఉన్నాయ‌ని బిగ్ బాస్ మొద‌లు అయిన నాటి నుంచి ప్రేక్ష‌కులు అంటున్నారు. కానీ ఈ వారం ఫ‌లితాల‌న్నీ త‌ల కిందులు అయిన‌ట్టు తెలుస్తుంది.

అస‌లు ఈ వారం కాజ‌ల్ లేదా సిరి లో ఎవ‌రో ఒక‌రు ఎలిమినేట్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని ప‌లువురు భావించారు. అలా కాకుండా కాజ‌ల్, యాంక‌ర్ ర‌వి ల‌లో ర‌వి ఎలిమినేట్ అవుతార‌ని తెలుస్తుంది. దీంతో ర‌వి అభిమానులు షాక్ తింటున్నారు. ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఇప్పుడే ఎలా ఎలిమినేట్ అవుతాడ‌ని అనుకుంటున్నారు. ర‌వి క‌న్న బ‌ల‌హీన మైన ఆట‌గాళ్లు హౌస్ లో చాలా మంది ఉన్నారు. కాజల్ తో పాటు సిరి, ప్రియాంక కూడా ర‌వి కన్న ఆట లో నూ ఓట్ల‌ల‌లో నూ ర‌వి వెనుకాలే ఉంటారు. అయినా ర‌వి ఎలా ఎలిమినేట్ అవుతార‌ని త‌న అభిమానులు షాక్ అవుతున్నారు. కాగ బిగ్ బాస్ లో ఓట్ల ప‌రం గా ఎలిమినేష‌న్స్ జ‌ర‌గ‌డం లేద‌నే విమ‌ర్శ ఒక్క‌టి ఉంది. ఇప్పుడు నిజం గానే ర‌వి ఎలిమినేట్ చేస్తే ఈ విమ‌ర్శ నిజం అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news