పీఐబీ ఫ్యాక్ట్ చెక్: కేబీసీ లాటరీ మెసేజ్ ఫేక్

-

రిలయన్స్ జియో ఇన్‌ఫో కంతో కలిసి ప్రముఖ టీవీ షో కోన్ బనేగా కరోడ్ పతి పేరిట ప్రచారం అవుతున్న లాటరీ స్కామ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అది ఫేక్ మెసేజ్ అని భారత ప్రభుత్వం తెలిపింది. ఈ లాటరీ స్కామ్ పై దేశంలో విస్తృత ప్రచారం జరిగింది. లాటరీలో గెలుపొందిన వారికి రూ.25లక్షల బహుమతి ఇస్తామని అనే మెసేజ్ దేశంలోని చాలా మంది ప్రజలకు మెసేజ్‌ వెళ్లింది. ఇందుకు సంబంధించిన ఇమేజ్‌ను కూ యాప్‌లో షేర్ చేశారు. ఈ విషయమై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ చేసింది. అదో ఫేక్ స్కీమ్ అని, దానితో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.

ఇలాంటి ఫేక్ మెసేజ్‌లు వచ్చినప్పుడు ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించి, మోసగాళ్ల ఉచ్చులో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కేబీసీ బ్రాండ్‌ పేరుతో లాటరీ పేరిట మోసపూరిత సందేశాలను ఇంటర్నెట్ ద్వారా సెండ్ చేస్తున్నారు. ఈ విషయమై సోషల్ మీడియా వేదికగా కొంత మంది పోలీసుల దృష్టికి తీసుకెళ్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news