బిగ్ బాస్ 6 : గీతూను తనదైన స్టైల్ లో ఒక ఆట ఆడుకున్న నాగార్జున..!!

-

వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో గా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ ఎట్టకేలకు తెలుగులో ఐదు సీజన్లను పూర్తిచేసుకుని సెప్టెంబర్ 4వ తేదీన బిగ్ బాస్ 6 ప్రసారం అయిన విషయం తెలిసిందే. ఇక ఆ రోజు నుంచి ప్రేక్షకులకు ప్రతిరోజు మంచి వినోదం కలిగిస్తోంది. ఇక ఇందులో 21 మంది కంటెస్టెంట్లతో ప్రతిరోజు వారు చేసే డైలీ పనులతో పాటు వారికి బిగ్ బాస్ ఇచ్చే ఆటలు, పాటలు అన్నీ కూడా ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటున్నాయి. శనివారం నాగార్జున హౌస్ మేట్స్ ను పలకరించి స్తుతి మెత్తని క్లాస్ పీకాడు. నవ్వుతూనే నాలుగు వడ్డించాడని చెప్పవచ్చు.

ముఖ్యంగా గీతూ విషయంలో సెటైర్స్ పడుతూనే ఉన్నాయి. మంచో చెడ్డో నా పేరు వస్తోంది కదా అన్నట్లుగా ప్రతి విషయానికి నవ్వుతోంది.. కన్నింగ్ గేమర్ అని పార్టిసిపెంట్స్ ఇచ్చినా కూడా మురిసిపోతోంది . ఇక అసలు గీతూ ప్లాన్ ఏంట్రా బాబు అని బిగ్ బాస్ ఆడియన్స్ అందరూ ఆలోచనలో పడ్డారు.. ప్రేక్షకులకే కాదు హౌస్ మేట్స్ కి కూడా ఇరిటేషన్ తెప్పిస్తోంది. ఇక నాగార్జున క్లాస్ పీకుతున్నా సరే పాజిటివ్గా తీసుకుంటూ రెచ్చిపోతుంది.. ఇక శనివారం రోజు అభినయశ్రీ తో గొడవ పెట్టుకుంది.. ఇంతకు ఈ అమ్మడి ప్లాన్ ఏమిటి అంటే హౌస్ మేట్స్ అందరిలో వ్యతిరేకత వస్తే ఆడియన్స్ నుంచి సింపతి వర్కౌట్ అవుతుందని ప్లాన్లో ఉన్నట్టు ఉంది గీతూ ..

గీతూ .. హౌస్ మేట్స్ కాదు.. ఆడియన్స్ డిసైడ్ చేస్తారు.. అలాగే హౌస్ లో ఎవరితోనూ రిలేషన్స్ పెట్టుకోవడానికి రాలేదు.. కేవలం హౌస్ లో టైటిల్ విన్నర్ గా నిలవడానికి వచ్చాను నాకు బిగ్ బాస్ హౌస్ లో ఎవరితోనూ రిలేషన్స్ అవసరం లేదు .. అంటూ నిర్మొహమాటంగా చెప్పేసింది. ఇదే విషయాన్ని పట్టుకున్న నాగార్జున ఎపిసోడ్ మొత్తం గీతూ ను రోస్ట్ చేస్తూనే ఉన్నాడు. కౌంటర్స్ వేస్తున్నా.. గీతూ మాత్రం పట్టించుకోవడం లేదు. ఇకపోతే నాగార్జున ఈమెను తిట్టడంతో మొదటి వారమే గలాట గీతూ ఆడియన్స్ నుంచి కొత్త నెగిటివిటీని మూటగట్టుకుంది. అంతే కాదు ఆమెది స్లాంగ్ కాదు అని ఓవరాక్షన్ అని సోషల్ మీడియాలో కూడా కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version