Bigg Boss 5 : రెచ్చ‌గొట్టి.. ఎర్రి పుష్పం చేస్తున్నారు.. ఒంట‌రైన స‌న్నీ

-

Bigg Boss 5 : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను అమితంగా ఆక‌ట్టుకుంటున్న షో బిస్ బాస్ తెలుగు సీజ‌న్ 5. ఈ సీజ‌న్ చివ‌రి ద‌శ‌కు చేరుకున్న కొద్దీ.. రోజురోజుకు ర‌స‌వ‌త్తంగా మారుతోంది. వారానికి ఒక్కో కంటెస్టెంట్ ఎలిమినేట్ కావ‌డంతో ..ఇక నెక్స్ట్ ఎవరు ఎలిమినేట్ అవుతార‌నే ఉత్కంఠ మొద‌లైంది. దీంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కోసం బయట ఫ్యాన్ తెగ ప్రమోషన్స్ చేస్తున్నారు . సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌మ అభిమాన కాంటెస్టెంట్ల‌కు ఓట్లు వేయాల‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా రిలీజ్ అయినా ప్రోమో చాలా ఆస‌క్తికరంగా ఉంది. బిగ్ బాస్ పై మంచి హైప్ క్రియేట్ చేస్తోంది.

తాజా ప్రోమో ప్ర‌కారం.. ఇక కెప్టెన్ టాస్క్ లో భాగంగా మరొక పవర్ పొందిన రవి. పవర్ హౌస్ దగ్గర శ్రీ రామచంద్ర, అనీ మాస్టర్, రవి లు కెప్టెన్సీ టాస్కులో నెక్ట్స్ ఎవ‌రూ పాల్గొంటే బాగుంటుంద‌ని మాట్లాడుకుంటున్నారు. ఇంత‌లో సడన్ గా పవర్ హౌస్ సైరెన్ మోగింది. ర‌వి సైర‌న్ కి ద‌గ్గ‌ర‌ల్లో ఉండ‌టంతో వెళ్లి చేయి ఆక్సిక్ చేశాడు. దీంతో అతనికి ఓ స్పెష‌ల్ పవర్ లభించింది. అయితే ఆ పవర్ ను ఎవరికైనా ఇవ్వ‌వ‌చ్చున‌ని బిగ్ బాస్ చెప్ప‌డంతో ర‌వి సన్నీ ని సెలెక్ట్ చేసుకున్నాడు.

ప‌వర్ రూం నుంచి .. బ‌య‌ట‌కు వ‌చ్చిన ర‌వి.. ఆ ప‌వ‌ర్ ను సన్నీకి ప్ర‌య‌త్నించాడు. కానీ, తొలుత స‌న్నీ ఆ ప‌వ‌ర్ ను తీసుకోవ‌డానికి ఒప్పుకోలేదు. కానీ.. ఇది బిగ్బాస్ ఆదేశమ‌నీ, క‌చ్చితంగా ఆ రూల్ పాటించాలని శ్రీరామ్ చెప్పినప్పటికీ ప్ర‌య‌త్నించినా ఒప్పుకోలేదు. మొదట్లో ససేమిరా అన్నాడు. ఇది పాజిటివ్ పవ‌ర్ మామా అంటూ.. ఒప్పుకునేలా చేశాడు ర‌వి.

ఇక్క‌డే ఓ అనుమానం వ‌స్తుంది. అది పాజిటివ్ ప‌వ‌ర్ అయితే.. ర‌వి త‌న స్నేహితులైనా శ్రీ రామ్ లేదా ఆనీ మాస్ట‌ర్ కు ఇచ్చేవాడుగా అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇక పవర్ టూల్ ను తీసుకోక తప్పలేదని స‌న్నీ తీసుకున్నారు. ఆ ప‌వ‌ర్ టూల్ తో గోల్డ్ మైన్ చేసే వారిని త‌ప్పించి.. వారి స్థానంలో గేమ్ లోకి వెళ్లిపోవచ్చ‌ని చెప్ప‌డంతో ఓకే చెప్పాడు.

ఇక్క‌డ మ‌రో సందేహం అంద‌రిలో వ‌స్తుంది. టాస్కు ఆడేట‌ప్పుడూ సంచాల‌క్ నిర్ణ‌యమే ప్ర‌ధానమే కాబ‌ట్టి.. ర‌వి ఈ ప‌వ‌ర్ ను స‌క్ర‌మంగా ఉప‌యోగించుకునేలా చేశాడా..? ఎలా వివాదాలు సృష్టించేలా మారుస్తాడా అనేది మరో సందేహం త‌ల్లెతోంది. ఈ క్ర‌మంలో స‌న్నీ ఏకంతంగా కూర్చోని భాద‌ప‌డ‌టం క‌నిపించింది. సంచాలక్ రవి ఏ మాత్రం పర్ఫెక్ట్ గా లేడు అని బిగ్ బాస్ కు మరొకసారి కంప్లైంట్ చేశాడు.

ర‌వి ..ఏదో పర్ఫెక్ట్ సంచాలకుడిగా బిల్డప్ ఇస్తున్నాడని త‌న‌తో తాను ఒంట‌రిగా మాట్లాడుకుంటున్నారు.
ఈ పవర్‌తో త‌న‌ని బ‌లి చేస్తున్నారనీ, మిస్టర్ కూల్ ఉన్న త‌న‌ని రెచ్చ‌గొట్టి మ‌రి ఎర్రి పుష్పం చేస్తున్నార‌ని వాపోయాడు.. ఈ క్ర‌మంలో ఐమ్ ఏ పూర్ బాయ్ అంటూ పాట‌పాడ‌టం కనిపించాడు. నిజంగా స‌న్నీని ఒంట‌రి చేశార‌నీ, కాజ‌ల్ , మాన‌స్ కూడా స‌న్నీని దూరం పెట్టేశారా అనేది తెలియాలంటే.. ఈ ఎపిసోడ్ చూడాల్సిందే..

Read more RELATED
Recommended to you

Latest news