Bigg Boss Winner Nikhil: బిగ్ బాస్ సీజన్ 8 విజేత గా నిఖిల్ నిలిచారు. ఈ మేరకు అక్కినేని నాగార్జున అధికారికంగా బిగ్ బాస్ సీజన్ 8 విజేత గా నిఖిల్ ను ప్రకటించారు. ఇక బిగ్ బాస్ సీజన్ 8 విజేత నిఖిల్ కు… హీరో రామ్ చరణ్ చేతుల మీదుగా ప్రైజ్ మనీ దక్కింది. 55 లక్షల రూపాయల చెక్కును బిగ్ బాస్ సీజన్ 8 విజేత నిఖిల్ కు అందించారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.
వీటితో పాటు…సుజుకి డిజైర్ కారు కూడా బిగ్ బాస్ సీజన్ 8 విజేత నిఖిల్ కు వచ్చింది. ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు వారానికి 2.25 లక్షలు చొప్పున 15 వారాలకు 33.75 లక్షలు బిగ్ బాస్ సీజన్ 8 విజేత నిఖిల్ సంపాదించినట్లు సమాచారం అందుతోంది. ఈ లెక్క ప్రకారం బిగ్ బాస్ సీజన్ 8 విజేత నిఖిల్ కారుతో పాటు 88 లక్షలు… గెలుచుకున్నాడు అన్నమాట. అటు నిన్న రోజంతా… అన్న పూర్ణ స్టూడియోస్ వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. ర్యాలీకి అనుమతి నిరాకరించిన పోలీసులు..అన్న పూర్ణ స్టూడియోస్ చుట్టూ భారీకేడ్లు ఏర్పాటు చేశారు. గత ఏడాది జరిగిన ఘటనని దృష్టిలో ఉంచుకుని పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.