తిరుమల భక్తులకు అలర్ట్‌… ఇవాళ దర్శనాలకు ఎంత టైం అంటే ?

-

తిరుమల భక్తులకు అలర్ట్‌…ఇవాళ దర్శనాలకు 12 గంటల సమయం పడుతోంది. తిరుమల..వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 18 కంపార్టుమెంట్లలో వేచివున్నారు భక్తులు. టోకెన్‌ లేని భక్తులకు తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 66,160 మంది భక్తులు దర్శించుకున్నారు. 22, 724 మంది భక్తులు..తలనీలాలు సమర్పించారు.

Alert to Tirumala devotees Today Darshan takes 12 hours

హుండీ ఆదాయం రూ. 3.47 కోట్లు గా నమోదు ఐంది. ఇక తిరుపతిలో నేటి నుంచి ధనుర్మాస దర్శనం ప్రారంభం కానుంది. నేటి నుంచి జనవరి 14 వరకు పద్మావతి అమ్మవారి ఆలయం సుప్రభాత సేవ రద్దు చేశారు అధికారులు. ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటలకు వరకు భక్తులకు ధనుర్మాస దర్శనం ఉంటుంది.

  • తిరుమల..18 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు
  • టోకేన్ లేని భక్తులుకు సర్వ దర్శనానికి 12 గంటల సమయం
  • నిన్న శ్రీవారిని దర్శించుకున్న 66,160 మంది భక్తులు
  • తలనీలాలు సమర్పించిన 22, 724 మంది భక్తులు
  • హుండి ఆదాయం 3.47 కోట్లు

Read more RELATED
Recommended to you

Exit mobile version