బిగ్ బాస్ హోస్ట్ గా తారక్…!

-

హిందిలో సూపర్ హిట్ అయిన బిగ్ బాస్ షో, తెలుగులో కూడా మంచి విజయం సాధించింది. అక్కడ ఏ స్థాయలో ప్రేక్షకులు దీన్ని ఆదరించారో ఇక్కడ కూడా అదే స్థాయిలో స్పందన వచ్చింది. స్టార్ మా ఛానల్ నిర్వహిస్తున్న బిగ్ బాస్ కి మంచి స్పందన రావడంతో పాటుగా తెలుగు బుల్లి తెరను ఏలుతుంది. అయితే అనూహ్యంగా బిగ్ బాస్ మూడో సీజన్ కి పెద్దగా క్రేజ్ రాలేదు.

మొదటి సీజన్ కి జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా చేయగా రెండో సీజన్ కి నాగార్జున మూడో సీజన్ కి నానీ చేసారు. అయితే నానీతో అంత క్రేజ్ రాలేదు. ఈ నేపధ్యంలోనే ఇప్పుడు మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ వైపు స్టార్ మా యాజమాన్యం అడుగులు వేస్తుంది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో తారక్ నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ తో పాటుగా బిగ్ బాస్ లో కూడా అతని పాల్గొనే అవకాశం ఉంది.

తెలుగులో బిగ్ బాస్ హిట్ అయింది అంటే జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న స్టార్ ఇమేజ్. దీనితో స్టార్ మా యాజమాన్యం మళ్ళీ తారక్ కోసం ప్రయత్నాలు చేస్తుంది. మూడో సీజన్ లో నష్టాలు రావడంతో నాలుగో సీజన్ ద్వారా ఆ నష్టాలు పూడ్చుకునే ఆలోచనలో ఉంది. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, రవితేజా ని సంప్రదించినా తారక్ కి ఉన్న ఇమేజ్ అయితేనే బెస్ట్ అనే భావనలో స్టార్ మా ఉంది. మరి దీనికి తారక్ ఏమంటాడు అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news