బాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. బాలీవుడ్ స్టార్ నటి హుమా ఖురేషి సోదరున్ని దారుణంగా హత్య చేశారు. రక్షాబంధన్ పండుగకు ఒక్కరోజు ముందుగా ఈ విషాదం నెలకొంది. బాలీవుడ్ నటి హుమా ఖురేషి సోదరుడు ఆసిఫ్ ఖురేషి ఢిల్లీలో హత్యకు గురి కావడం జరిగింది. నిన్న అర్ధరాత్రి ఆఫీస్ నుంచి ఇంటి వద్ద పార్కింగ్ విషయంలో కొంతమంది యువకులతో బాలీవుడ్ స్టార్ నటి హుమా ఖురేషి సోదరుడు ఆసిఫ్ గొడవ పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

ఆ గొడవ పెద్ద వివాదంగా మారిందట. ఈ నేపథ్యంలోనే ఆసిఫ్ ఫై ఆయుధాలతో ఆ యువకులు దాడి చేసినట్లు తెలుస్తోంది. అయితే వెంటనే స్థానికులు చూసి అతన్ని ఆసుపత్రికి తరలించారు. కానీ అంతలోనే అసిఫ్ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో బాలీవుడ్ నటి హుమా ఖురేషి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఇక ఈ సంఘటనకు కారణమైన నిందితులను పోలీసులు అరెస్టు కూడా చేశారు. కాలా, జానీ, ఇష్కియా అలాగే బద్లాపూర్ సినిమాల్లో హుమా నటించిన సంగతి తెలిసిందే.