తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఆరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. ఇందులో మహబూబ్‌నగర్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నల్గొండ, నిజామాబాద్ ఉన్నాయి.

ఈ ఆరు జిల్లాలతో పాటు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అటు హైదరాబాద్ లో భారీ వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు అలర్ట్ జారీ చేశారు అధికారులు. హైదరాబాద్ నగరవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో హిమాయత్‌సాగర్‌కు భారీగా వరద ప్రవాహం భారీగా పెరిగింది.