గుడ్‌న్యూస్ చెప్పిన బీటౌన్ బ్యూటీ యామీ గౌతమ్

-

బాలీవుడ్ బ్యూటీ యామీ గౌతమ్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాను తల్లి కాబోతున్న విషయాన్ని షేర్ చేసుకుంది. . ‘ఆర్టికల్ 370’ అనే మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో తన భర్తతో కలిసి ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ వార్త విన్న యామీ ఫ్యాన్స్ ఆనందంతో తబ్బిబ్బయిపోతున్నారు. కాబోయే తల్లిదండ్రులకు నెట్టింట విషెస్ చెబుతున్నారు.

బీటౌన్లో సక్సెస్ఫుల్ స్టార్గా కొనసాగుతున్న సమయంలో యామీ ఉరి మూవీ డైరెక్టర్ ఆదిత్య ధర్తో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా తన కెరీర్తో పాటు పర్సనల్ లైఫ్ను బ్యాలెన్స్ చేస్తూ యామీ సక్సెస్ఫుల్గా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఇక తాజాగా ఈ గుడ్ న్యూస్ చెప్పి ఈ కపుల్ తమ ఫ్యాన్స్‌ను ఖుష్ చేశారు. అయితే ఆర్టికల్ 370 మూవీట్రైలర్ ఈవెంట్ లాంఛ్ స్టేజ్‌పైకి యామీని ఆదిత్య జాగ్రత్తగా తీసుకెళ్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి క్యూట్ కపుల్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news