రియాపై బుక్ లేదా బ‌యోపిక్ రానుందా?

బాలీవుడ్‌లో సంచ‌ల‌నం సృష్టిస్తున్న పేరు రియా చ‌క్ర‌వ‌ర్తి. సుశాంత్ మ‌ర‌ణం వ‌ర‌కు ఈ న‌టి ఎవ‌రో కూడా బాలీవుడ్ జ‌నాల‌కి తెలియ‌దు. కానీ సుశాంత్ అనుమానాస్ప‌ద మృతి త‌రువాత ఒక్క‌సారిగా రియా డ్ర‌గ్స్ కేసులో బ‌య‌ట‌ప‌డ‌టంతో పాపుల‌ర్ అయిపోయింది. అంత‌ర్జాతీయ స్థాయిలో ఆమెకి పాపులారిటీ పెరిగింది. జాతీయ మీడియానే కాకుండా తాజా కేసు అంత‌ర్జాతీయ మీడియా కూడా ఆమెపై వార్తా క‌థ‌నాలు ప్ర‌సారం చేస్తోంది.

గ‌త కొన్ని రోజులుగా ఉత్కంఠ‌భ‌రితంగా సాగుతున్న ఆమె క‌థ‌ని తెర‌పైకి తీసుకురావాల‌ని, లేదా డాక్యుమెంట‌రీగా తీయాల‌ని నిర్మాత‌లు భావిస్తున్నార‌ట‌. లేదా ఆమె బ‌యోపిక్‌నే తెర‌పైకి తీసుకురావాల‌ని గ‌త కొన్ని రోజులుగా చ‌ర్చించుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఓ బుక్ ప్ర‌చుర‌ణ సంస్థ ఏకంగా రియాపై ఓ పుస్త‌కాన్నే ప్ర‌చురించాల‌ని భావిస్తోంద‌ట‌. ఇందుకు ఆమెతో ఒప్పందం కోసం ఎదురుచూస్తున్న‌ట్టు బాలీవుడ్ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ఇదిలా వుంటే బాంబే హైకోర్టు రియా, షోవిక్  పెట్టుకున్నబెయిల్‌ పిటీష‌న్ పై మంగ‌ళ‌వారం స్పందించాల‌ని సీబీఐని ముంబై హైకోర్టు ఆదేశించింది.