గురు తర్వాత కొద్దిపాటి గ్యాప్ తీసుకున్న విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడని చెప్పొచ్చు. వరుణ్ తేజ్ తో ఎఫ్-2, నాగ చైతన్యతో వెంకీ మామ మల్టీస్టారర్ సినిమాలు చేస్తున్న వెంకటేష్ ఆ తర్వాత సోలోగా వెంకీ అట్లూరి, త్రివిక్రం లతో సినిమాలు చేయాలని చూస్తున్నాడట. ఇక వెంకటేష్ దర్శకుల రేసులో బొమ్మరిల్లు భాస్కర్ కూడా ఉన్నాడని తెలుస్తుంది.
బొమ్మరిల్లు సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభ చాటుకున్న భాస్కర్ ఆ తర్వాత పరుగు కూడా పర్వాలేదనిపించుకున్నాడు. అయితే ఒంగోలు గిత్త తర్వాత తమిళంలో బెంగళూరు డేస్ రీమేక్ చేసినా వర్క్ అవుట్ కాలేదు. ఇక ఈమధ్య ఓ క్రేజీ స్టోరీ లైన్ తో వెంకటేష్ ను కలిశాడట భాస్కర్. వెంకీ కూడా లైన్ నచ్చేయడంతో ఫుల్ స్క్రిప్ట్ తో రమ్మాన్నాడట.
దాదాపు ఈ సినిమా ఓకే అయినట్టే అంటున్నారు. ఈ సినిమాతో పాటుగా త్రివిక్రం డైరక్షన్ లో మరో మూవీ ప్లాన్ చేస్తున్నాడు వెంకటేష్. ఎఫ్-2, వెంకీ మామా హిట్ కొడితే మాత్రం వెంకటేష్ కు మరింత క్రేజ్ రావడం ఖాయం.