అఖిల్.. బోయపాటి.. కాంబో ఫిక్స్

-

అక్కినేని అఖిల్ ప్రస్తుతం తన మూడవ సినిమాగా వెంకీ అట్లూరి డైరక్షన్ లో చేస్తున్నాడు. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మిస్టర్ మజ్ను అనే టైటిల్ ఫిక్స్ చేశారు. లవ్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమాలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత అఖిల్ స్టార్ డైరక్టర్ బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తాడని లేటెస్ట్ న్యూస్.

అఖిల్ మొదటి సినిమా నుండి మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నాడు. మొదటి సినిమా అఖిల్ ఫ్లాప్ అవడంతో ఆ ప్రయత్నాలు ఆపేసి లవర్ బోయ్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నాడు. ఈమధ్యనే అఖిల్ కోసం ఓ అద్భుతమైన కథ సిద్ధం చేశాడట బోయపాటి శ్రీను. అఖిల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. బోయపాటి ప్రస్తుతం రాం చరణ్ హీరోగా సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే అఖిల్ సినిమాపై క్లారిటీ వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news