బ్రేకింగ్; ధనుష్ నీ బర్త్ సర్టిఫికేట్ ఎక్కడ…? కోర్ట్ సీరియస్…!

-

తమిళ సూపర్ స్టార్, రజని కాంత్ అల్లుడు హీరో ధనుష్ కి మదురై కోర్ట్ ఊహించని షాక్ ఇచ్చింది. ధనుష్ తమ కుమారుడు అంటూ కదిరేశన్ అనే వ్యక్తి పిటీషన్ వేసారు. దీనిపై విచారణ జరిపిన కోర్ట్ చెన్నై కార్పోరేషన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చిన్నతనంలో తిడితే ఇల్లు వదిలేసి పారిపోయాడని మధురైలో ఉండే కదిరేషన్, మీనాక్షి దంపతులు కోర్టుని ఆశ్రయించగా నాలుగేళ్ల నుంచి ఈ కేసు నడుస్తూనే ఉంది.

ప్రస్తుతం జరుగుతున్న విచారణలో ధనుష్ జనన, విద్య, ఇంటికి సంబందించిన ఒరిజినల్ సర్టిపికెట్లు ఎక్కడున్నాయని, ఇంత జరుగుతున్నా ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించింది. ఇవి వెంటనే కోర్టుకు సబ్‌మిట్ చేయాలని, అసలెందుకు ఇవి కోర్టుకు తీసుకురాలేదు, బర్త్ సర్టిఫికేట్ ఎందుకు సబ్‌మిట్ చేయలేదని కోర్ట్ మండిపడింది. తక్షణమే అతడికి సంబంధించిన అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు న్యాయస్థానంలో పొందుపరచాలని చెన్నై కార్పోరేషన్‌ను కోర్ట్ ఆదేశించింది.

దీనితో ఈ కేసు ఏ మలుపులు తిరుగుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఆయన కస్తూరి రాజా కొడుకు కాదని అంటున్నారు కదిరేశన్ మీనాక్షి దంపతులు. కొన్నాళ్ళు ఈ కేసు ధనుష్ కి పాజిటివ్ గా ఉన్నా ఇప్పుడు నెగటివ్ గా మారింది. దీనితో ధనుష్ డిఎన్ఏ సాంపిల్స్ కూడా తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. త్వరలోనే దీనిపై కోర్ట్ ఆదేశాలు కూడా ఇచ్చే సూచనలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version