అతడి వల్లే వివాహానికి దూరమైన బుల్లితెర రాములమ్మ..!

-

బుల్లితెర రాములమ్మ అలియాస్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పటాస్ షో ద్వారా తన కెరీర్ ను ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ పలుషోలకు యాంకర్ గా వ్యవహరించి మరింత పాపులారిటీని దక్కించుకుంది. అంతేకాదు సినిమాలలో అడపాదడపా అవకాశాలను అందుకుంటూ బుల్లితెరపై తన పంచ్ లతో ఏకధాటిగా మాట్లాడగలిగే శ్రీముఖి.. యాంకర్ గా బుల్లితెరను శాసించేలా చేసింది. ముఖ్యంగా కామెడీ షోలలో యాంకరింగ్ చేస్తూనే ఇటీవల సింగింగ్ కాంపిటీషన్ కి కూడా హోస్ట్ గా కూడా పనిచేస్తుంది. తన మాటలతో అందరినీ అట్రాక్ట్ చేయడమే కాకుండా తన అందచందాలతో యువతను బాగా కట్టిపడేస్తోంది.

ఇదిలా ఉండగా మూడు పదుల వయసులోకి వచ్చిన ఆమె ఎందుకు ఇంకా వివాహం చేసుకోలేదని చర్చ బాగా జరుగుతోంది. అయితే ఇందుకు బలమైన కారణం కూడా ఉందని సమాచారం. శ్రీముఖి కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు ఒక అబ్బాయిని ప్రేమించిందట. అతనితో చట్టాపట్టాలేసుకొని తిరిగిందట. అంతేకాదు అతని ప్రేమను నిజం అని నమ్మి సరదాగా మెలిగిందట. కానీ అతడి నిజస్వరూపం తెలియడంతో అతనిని దూరం పెట్టేసింది. శ్రీముఖి దూరం పెట్టడంతో అతను శ్రీముఖిని టార్చర్ చేయడం కూడా మొదలు పెట్టారట.. ప్రైవేటు పార్ట్స్ ఫొటోస్ , వల్గర్ వీడియోస్ శ్రీముఖికి పంపి ఆమెను మానసికంగా ఇబ్బందులకు గురి చేశాడట.

ఈ విషయాలను ఇంట్లో చెప్పలేక.. తనలో దాచుకోలేక చాలా కాలం కుమిలిపోయిందట. ఎట్టకేలకు ఆ మానసిక ఒత్తిడి నుంచి బయటపడినందుకు పెద్ద యుద్ధమే చేసింది. ఆ తర్వాత బాధ నుంచి తేరుకొని కెరియర్ పై గట్టిగా ఫోకస్ పెట్టింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వాడు చేసిన మోసాన్ని తట్టుకోలేక పెళ్లి అనే ప్రస్తావన వచ్చినప్పుడల్లా శ్రీముఖి దాట వేస్తోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version