`ఆహా` కోసం బ‌న్నీ – త్రివిక్ర‌మ్ కాంబో!

ఈ ఏడాది బ‌న్నీ – త్రివిక్ర‌మ్ కాంబోలో వ‌చ్చిన చిత్రం `అల వైకుంఠ‌పుర‌ములో`. ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతికి విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాన్ని సాధించిన సంచ‌ల‌నం సృష్టించింది. బ‌న్నీ కెరీర్‌లోనే అత్య‌ధిక వ‌సూళ్ల‌ని సాధించిన చిత్రంగా నిలిచి ఇండ‌స్ట్రీ హిట్ అనిపించుకుంది. దీంతో వీరిద్ద‌రి కాంబినేష‌న్ అంటే భారీ క్రేజ్ ఏర్ప‌డింది.

గ‌తంలో బ‌న్నీ – త్రివిక్ర‌మ్‌ల క‌ల‌యిక‌లో జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి వంటి వ‌రుస హిట్లు వున్నాయి. ఈ రెండింటికి మించి వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన `అల వైకుంఠ‌పురములో` ఇండ‌స్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీ త‌రువాత మ‌ళ్లీ వీరిద్ద‌రూ క‌లిసి మ‌ళ్లీ వ‌ర్క్ చేయ‌బోతున్నారు. `ఆహా` కోసం మ‌ళ్లీ క‌ల‌వ‌బోతున్నారు.
ఇందు కోసం త్రివిక్ర‌మ్ – బ‌న్నీ కాంబోలో ఓ క‌మ‌ర్షియ‌ల్ యాడ్‌ని చేస్తున్నారు.

త్రివిక్ర‌మ్ – బ‌న్నీ ఈ యాడ్‌లో ఎలా మెఉస్మ‌రైజ్ చేయ‌బోతున్నారో తెలియాలంటే ఈ దీపావ‌ళి వ‌ర‌కు వేచి చూడాల్సిందే. ఈ యాడ్‌ని దీపావ‌ళికి రిలీజ్ చేయ‌నున్నారు. `ఆహా`ని మ‌రింత క‌ల‌ర్ ఫుల్ చేయాలిన మిగ‌తా ఓటీటీల‌కి గ‌ట్టి పోటీగా నిల‌వాల‌ని కొత్త‌గా గేమ్ షోల‌తో పాటు 5 కొత్త మూవీస్‌ ఈ నెల 13 నుంచి `ఆహా`లో స్ట్రీమింగ్ కాబోతున్నాయి.