కమల్ హాసన్ లీడ్ రోల్ లో 2013లో వచ్చిన విశ్వరూపం సినిమా అందరికి గుర్తింది కదా.. ఆ సినిమా అప్పట్లో సంచలన విజయం అందుకుంది. కమల్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా ఆస్కార్ రవిచంద్రన్ నిర్మించారు. ఇక ఆ సినిమా సీక్వల్ గా విశ్వరూపం-2 కూడా తెరకెక్కించారు. కొన్నాళ్లుగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ నెల 10న రిలీజ్ కాబోతుంది.
తెలుగు తమిళ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ అవబోతున్న ఈ సినిమా తెలుగులో బిజినెస్ కష్టాలు తప్పేలా లేవు. ఈమధ్య తమిళ సినిమాలు తెలుగులో బొక్కబోర్లా పడుతున్నాయి. ఆ కారణం వల్ల తమిళ సినిమాల డబ్బింగ్ మార్కెట్ పూర్తిగా పడిపోయింది. ఒకప్పుడు మన సినిమాలకు పోటీగా డబ్బింగ్ సినిమాల మార్కెట్ ఉండేది. రజిని, సూర్య, కార్తిల సినిమాలు ఈమధ్య తెలుగులో విఫలమవుతున్నాయి.
ఇక అదే క్రమంలో విశ్వరూపం-2 మీద కూడా తెలుగు ఆడియెన్స్ ఏమంత ఆసక్తి చూపించడం లేదు. అందుకే కమల్ కు బిజినెస్ కష్టాలు తప్పేలా లేవని తెలుస్తుంది. తెలుగులో ఓన్ గా రిలీజ్ చేయాలని చూస్తున్నాడట. ప్రముఖ నిర్మాత ఎన్వి ప్రసాద్ తెలుగు రిలీజ్ వ్యవహారాలు చూస్తారని సమాచారం.