ఈ వార్తను మీరు చదువుతున్నారంటే.. మీకు ఇంకా ఈ విషయం తెలిసినట్టుగా లేదు. ఇవాళ ఉదయమే చాలా మంది యూజర్లు ఈ మార్పును చూసి షాక్ అయ్యారు. ఆశ్చర్యపోయారు. తర్వాత ఇది ఎలా జరిగిందబ్బా అని నోరెళ్లబెడుతున్నారు. మీకు కూడా ఏం అర్థం కావట్లేదు కదా.. పదండి తెలుసుకుందాం.
ఇవాళ ఉదయం కొంతమంది తమ ఫోన్లను ఓపెన్ చేసి షాకయ్యారు. ఎందుకంటే.. వాళ్ల ఫోన్ లో ఓ కొత్త నెంబర్ వచ్చి యాడ్ అయింది. వాళ్ల కాంటాక్ట్ లిస్ట్ లో వచ్చి చేరింది. కాని.. అది కాంటాక్ట్ లిస్ట్ లో ఎలా సేవ్ అయిందా అని తెలియక నెత్తిగోక్కుంటున్నారు. ఎందుకంటే.. నెంబర్ ను సేవ్ చేస్తేనే కదా సేవ్ అయ్యేది. మరి.. ఎందుకిలా ఆటోమెటిక్ గా సేవ్ అయిందని ఆశ్చర్యపోతున్నారు. ఇదేమన్నా హ్యాకర్ల పనా అని భయపడ్డారు. కాని.. తర్వాత తెలిసిందేమిటంటే.. అది ఆధార్ కార్డుకు సంబంధించిన నెంబర్.
ఆధార్ కార్డును జారీ చేసే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) కి సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్. ఇదివరకు దాని నెంబర్ 1800 – 300 -1947 గా ఉండేది. ఇప్పుడు దాన్ని మార్చి 1947 గా మార్చారు. ఆ నెంబరే యూఐడీఏఐ పేరుతో ఇండియాలోని కొంతమంది యూజర్ల ఫోన్లలో సేవ్ అయింది. దీనిపై ఓ వ్యక్తి ట్వీట్ చేయడంతో ఇప్పుడు నెటిజన్లు దీనిపైనే చర్చిస్తున్నారు. దీంతో అందరూ తమ ఫోన్లు చెక్ చేసుకుంటున్నారు. తమ ఫోన్లలో నెంబర్ సేవ్ అయిందేమోనని కాంటాక్ట్ లిస్టును జల్లడ పడుతున్నారు.
అయితే.. దీనిపై స్పందించిన యూఐడీఏఐ.. తాము ఏ సర్వీస్ ప్రొవైడర్ కు, మొబైల్ నెట్ వర్క్ కంపెనీలను ఈ నెంబర్ ను యాడ్ చేయాలని చెప్పలేదని వివరణ ఇచ్చింది. వామ్మో.. అయితే మరి.. ఆ నెంబర్ ఎవరు యాడ్ చేసి ఉంటారబ్బా అంటూ యూజర్లు నెత్తి గోక్కుంటున్నారు. మీకేమైనా తెలుసా.. ఎవరు ఈ పని చేసుంటారో?