రాకింగ్ రాకేష్ స్టార్ కథానాయకుడిగా నటిస్తూ.. నిర్మించిన చిత్రం కేసీఆర్ (కేశవ చంద్ర రమావత్). గరుడ వేగ అంజి దర్శకత్వం వహించారు. నవంబర్ 22న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకి యావరేజ్ టాక్ వచ్చింది. కానీ అదే సమయంలో మరికొన్ని మూవీస్ రిలీజ్ కావడంతో పెద్దగా జనాలకు రీచ్ కాలేదు. ఈ తరుణంలోనే ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.
తెలంగాణ ఉద్యమ నేపథ్యం, కొత్తగా ఏర్పడిన తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎన్నికైన పరిణామాలకు ఓ లంబాడీ యువకుడి జీవిత ప్రయాణాన్ని జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నటి సత్య కృష్ణన్ ఈ సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. డిసెంబర్ 28 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ విడుదల చేసింది ఆహా.