టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. చేతి దాకా వచ్చి… అవార్డు వెనక్కి వెళ్లిపోయింది. గత కొన్నిరోజుల క్రితం జానీ మాస్టర్ అత్యాచారం కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. రీసెంట్ గానే బెయిల్ పై బయటికి వచ్చిన జానీ మాస్టర్ కు బిగ్ షాక్ ఎదురైంది. అతను తాజాగా నేషనల్ అవార్డుకు ఎంపికయ్యారు.
కానీ ఈ అవార్డును రద్దు చేశారు. ఫోక్సో కేసు నమోదు కావడంతో కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, ఈ అవార్డుకు ఎంపికైన అతికొద్ది రోజులకే జానీ మాస్టర్ పై అత్యాచార ఆరోపణలు రావడంతో అరెస్ట్ అయ్యాడు. అవార్డు అందుకోవడానికి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు కోర్టు ఇటీవల బెయిల్ కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 6 అంటే ఇవాల్టి నుంచి 10 వ తేది వరకు బెయిల్ జాని మాస్టర్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది రంగారెడ్డి జిల్లా కోర్టు.