Mallik Teja: తెలంగాణ ఫోక్ సింగర్, రైటర్ మల్లిక్ తేజ.. లైంగిక వేధింపుల కేసు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో తాజాగా తెలంగాణ ఫోక్ సింగర్, రైటర్ మల్లిక్ తేజకు భారీ ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టులో మల్లిక్ తేజకు.. బిగ్ రిలీఫ్ దక్కింది. ఆయనకు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడం జరిగింది.
డబ్బుల కోసమే తనను యువతి ఇబ్బందులకు గురిచేసిందని… హైకోర్టు విచారణ సందర్భంగా తేజ వివరించారు. సింగర్ తేజ పైన అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని… తేజ తరఫు న్యాయవాది.. కూడా తన తరఫు వాదనలో వినిపించారు. అయితే ఈ వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు…. తెలంగాణ ఫోక్ సింగర్, రైటర్ మల్లిక్ తేజకు.. బెయిల్ మంజూరు చేయడం జరిగింది. కాగా.. తనను స్టూడియోలోనే తెలంగాణ ఫోక్ సింగర్, రైటర్ మల్లిక్ తేజ రేప్ చేశాడని బాధిత సింగర్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే.