అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాకు లైన్ క్లియర్…!

-

అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాకు లైన్ క్లియర్ అయింది. వైజింగ్ కమిటీ ఆదేశాల అనుసారం యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 1200 థియేటర్స్ లో ఈ రోజు అర్దరాత్రి 12గంల నుంచి ఈ సినిమా స్ ప్రదర్శించనున్నారు. హైకోర్ట్ ఆదేశాల మేరకు… రివైజింగ్ కమిటి ఈ సినిమాను వీక్షించింది… కొన్ని అభ్యంతరకర సీన్లు ఉండగా వాటిని తొలగించడానికి చిత్ర యూనిట్ అంగీకరించింది. సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడంతి చిత్ర యూనిట్ హైకోర్ట్ కి వెళ్ళింది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వలేదని కోర్టుకు తెలపగా…

దీనిపై విచారణ జరిగింది… పిటీషన్ పై సెన్సార్ బోర్డు,చిత్ర యూనిట్ సభ్యులు.. కౌంటర్ దాఖలు చేసారు. చిత్రం లో ఉన్న అభ్యంతరాలు అన్ని తీసేసామని కోర్ట్ కి చిత్ర యూనిట్ తెలపగా తీసి వేసినట్టు ఎక్కడ లేదని కేవలం మ్యుట్ లో ఉంచారని మాత్రమే కౌంటర్ లో పేర్కొన్నారని వ్యాఖ్యానించింది. మ్యూట్ లో ఉంచలేదని కొన్ని సన్నివేశాలను డిలీట్ కూడా చేసామని… బోర్డు సూచనల మేరకు ఛానెల్స్ యొక్క లోగోలను కూడా తొలగించామని కోర్ట్ కు చిత్ర యూనిట్ వివరించింది. ఎగ్జామినేషన్ కమిటీ చిత్రాన్ని మత పరమైన అంశాలతో పాటు,

శాంతి భద్రత సమస్యలు తలెత్తే అవకాశం అప్రూల్ చేయలేమని కౌంటర్ పేర్కొన్నారని హైకోర్ట్ వ్యాఖ్యానించింది. మళ్ళీ రివ్యూ కి వెళ్ళిన చిత్ర యూనిట్… రివ్యూ కమిటీ ఇప్పటికే చిత్ర యూనిట్ కు షోకాజ్ నోటీసులు ఇచ్చిందని అడిషనల్ సోలిసిటర్ జనరల్ పేర్కొన్నారు. అభ్యంతరాలన్ని సవరించుకున్న నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితి ఏంటని కోర్ట్ ప్రశ్నించగా… రివ్యూ కమిటీ ఇంకా చిత్రాన్ని పరీశీలించలేదని సోలిసిటర్ జనరల్ పేర్కొన్నారు. రీవ్యూ కమిటీ చిత్రాన్ని చూసి నిర్ణయం తెలపాలని హైకోర్ట్ పేర్కొనగా…

రివ్యూ కమిటీ పరిధిలో ఉందని ఇప్పుడు తాము ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని చెప్పింది కోర్ట్. రివ్యూ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ పై నిర్ణయం తీసుకోవాలని… అన్ని సక్రమంగా ఉన్నట్లయితే ఆర్డర్ పాస్ చేయాలని రివ్యూ కమిటి కి హైకోర్టు ఆదేశాలు జారి చేసింది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాను విడుదల కానీయకుండా బిజెపి ఎంపీ… సుజనా చౌదరి అడ్డుకున్నారని నిర్మాత నట్టి కుమార్ ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version