మీటూ ఎఫెక్ట్ చిన్మయిపై వేటు పడ్డది

-

బాలీవుడ్ మీటూ ఎఫెక్ట్ సౌత్ సినిమా పరిశ్రమలో అలజడి సృష్టిస్తుంది. సింగర్ చిన్మయి ధైర్యంగా తమిళ రచయిత వైరముత్తు తన మీద చేసిన లైంగిక దాడిని గురించి చెప్పుకొచ్చింది. అంతేకాదు డబ్బింగ్ యూనియన్ ప్రెసిడెంట్ రాధారవి మీద విమర్శలు చేసింది చిన్మయి. దానికి బదులుగా ఆమెను డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోషియేషన్ నుండి తొలగించినట్టు తెలుస్తుంది.

రెండేళ్లుగా సభ్యత్వ రుసుము చెల్లించని కారణంగా ఆమెను తమిళ డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోషియేషన్ నుండి తొలగించారట. అయితే రెండేళ్లుగా చేయని పని ఇప్పుడు ఎందుకు చేశారంటూ నిలదీస్తుంది చిన్మయి. అంతేకాదు తన ఫీజులో ఎందుకు 10 శాతం కట్ చేశారని వాదన మొదలుపెట్టింది. తనకు ఈ పరిస్థితి వస్తుందని తాను ముందే ఊహించానని చిన్మయి తన ట్విట్టర్ లో చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ న్యూస్ గా మారాయి. మరి చిన్మయి ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలేస్తుందా లేక మరేదైనా స్టెప్ తీసుకుంటుందా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version