Chiranjeevi: ఆ భ్రమలను తొలగించేది ‘ఆచార్య’నే..నాది గ్యారంటీ: చిరంజీవి

-

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆచార్య’ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘సిద్ధ’ అనే ఫుల్ లెంగ్త్ రోల్ ప్లే చేయగా, టైటిల్ రోల్ ను చిరంజీవి ప్లే చేశారు. ఈ పిక్చర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.

మెగా అభిమానులు, సినీ ప్రముఖులు ఈ ఫంక్షన్ కు హాజరయ్యారు. RRR దర్శకులు ఎస్.ఎస్.రాజమౌళి ఈ ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ క్రమంలోనే చిరంజీవి మాట్లాడుతూ ‘ఆచార్య’ చిత్రం గురించి రాజమౌళి హీరోలకు ఆపాదిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి డైరెక్ట్ చేసిన హీరోలకు వారి తర్వాత చిత్రాలు ఫెయిల్ అవుతాయనే నమ్మకం ఉందని, అయితే, ఆ భ్రమను తొలగించేది ‘ఆచార్య’నే అని చిరంజీవి స్పష్టం చేశారు.

రాజమౌళి దర్శకత్వంలో సినిమాలు చేసిన హీరోలకు తర్వాత సినిమాలు ఫెయిల్ అవడం గతంలో జరిగింది. అయితే, అది వాళ్లు ఎంచుకున్న సబ్జెక్ట్ మ్యాటర్ తప్ప రాజమౌళికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. RRR తర్వాత రామ్ చరణ్ నటించిన ‘ఆచార్య’ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలను ఇంకా పెంచేశారు మెగాస్టార్ చిరంజీవి.

Read more RELATED
Recommended to you

Exit mobile version