అనిల్ సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్?

-

 

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తిస్థాయి కామెడీ ఎంటర్టైనర్ సినిమాగా తెరకేక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను ప్రారంభించినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తోంది. అంతేకాకుండా మరో ఇద్దరు హీరోయిన్లు కూడా కీలక పాత్ర పోషించనున్నారు.

ఈ సినిమాకు సంబంధించి మరో వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ పోషించనున్నారు. అందులో ఓ పాత్ర వింటేజ్ చిరంజీవిని గుర్తు చేస్తే, మరో పాత్ర యాక్షన్ మోడ్ లో ఉండబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ సినిమాలో చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల కూడా భాగం కాబోతోంది. సుస్మిత కొనిదెల నిర్మాణంలో చిరంజీవి నటిస్తున్నారు. కాగా ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించి మరింత సమాచారం వెలువడాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news